ఆల్‌ బుకారా..

ఆల్‌ బుకారాలో ఫైబర్‌, సార్బిటాల్, ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. వందగ్రాముల ఆల్‌ బుకారాలో బంగాళాదుంపలలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగ కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం కారణంగా బాధపడేవారు ఈ పండ్లు తరచూ తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. (image source- pixabay)

Digene gel recall: ఈ కడుపు నొప్పి సిరప్ వాడుతున్నారా? హెచ్చరించిన డీజీసీఐ!

పియర్..

పియర్..

పియర్ మలబద్ధకానికి చికిత్స చేయడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. వంద గ్రాముల పియర్స్‌లో 5 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. దీనిలో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. పియర్స్‌‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, దీనిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మలబద్ధకం సమస్యను పరిష్కరించడానికి పియర్స్‌ పండ్లు సహాయపడతాయి.

High Calcium Foods:పాలు తాగరా..? ఈ 5 కాల్షియం రిచ్‌ ఫుడ్స్‌ మీ కోసమే..!

(image source- pixabay)

అరటిపండ్లు..

అరటిపండ్లు..

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. వంద గ్రాముల అరటిపండ్ల ద్వారా 3.1 గ్రాముల ఫైబర్‌ను పొందవచ్చు. ఫైబర్‌ మీ జీవక్రియను మెరుగుపరచడానికి, పేగు కదలికలను సులభతరం చేయడానికి తోడ్పడతాయి. ఇది మీ పొట్టను క్లీన్‌ చేస్తుంది. అరటిపండులో విటమిన్లు, మినరల్స్‌ కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణ అందిస్తాయి.

(image source- pixabay)

కివి..

కివి..

కివిలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ పుల్లటి పండ్లలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వంద గ్రాముల కివీలో 2.5 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఈ పండ్లు పేగు కదలికలను సులభతరం చేసి.. మలం సులభంగా విసర్జన అయ్యేలా చేస్తుంది.

(image source- pixabay)

అంజీర్‌..

అంజీర్‌..

నానబెట్టిన డై అంజీర్‌ తీసుకుంటే.. మలబద్ధకం సమస్య నయం అవుతుంది. ఎండిన అంజీర్‌లో కరిగే, కరగని ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

(image source- pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *