​Okra for diabetes: మన దేశంలో దాదాపు 80 మిలియన్ల మంది జనం డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అందుకే మన దేశాన్ని డయాబెటిస్‌ క్యాపిటల్‌ అని పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా.. షుగర్‌ వ్యాధితో బాధపడేవారి సంఖ్య 2045 కల్లా 135 మిలియన్లు పెరుగుతుందని ఇంటర్‌నేనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. ఒకసారి డయాబెటిస్‌ వస్తే.. దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్పించి, పూర్తిగా నయం చేయలేం. దీర్షకాలం పాటు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో లేకపోతే.. గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, దృష్టి లోపం, నరాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం మేలు. పోషకాహారం, చురుకైన జీవనశైలి ద్వారా మాత్రమే డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని పోషకాహార నిపుణురాలు, డైటీషియన్, ఫ్యాట్ టు స్లిమ్ డైరెక్టర్ శిఖా అగర్వాల్ స్పష్టం చేశారు. మీ డైట్‌లో కొన్ని కూరగాయలు, పండ్లు చేర్చుకుంటే.. డయాబెటిస్‌ లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిలో ఒకటి బెండకాయ. షుగర్‌ పేషంట్స్‌కు బెండకాయ ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. మీ డైట్‌లో బెండకాయను కచ్చితంగా చేర్చుకోవాలని అంటున్నారు.

ఈ పోషకాలు ఉంటాయి..

బెండకాయలో ప్రొటీన్లు , క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. (image source- pixabay)

టైప్ 2 డయాబెటీస్ ఎందుకొస్తుంది..

టైప్ 2 డయాబెటీస్ ఎందుకొస్తుంది..

ఫైబర్‌ మెండుగా ఉంటుంది..

ఫైబర్‌ మెండుగా ఉంటుంది..

బండకాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, కరిగే, కరగని ఫైబర్‌ మెండుగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచి ఆహారం. పైబర్‌ ఆహారం విచ్ఛిన్నం, జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. దీంతో బ్లడ్‌ షుగర్ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.(image source- pixabay)​

Food For Eyes: కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. 10 ఆహారాలు ఇవే..!

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది..

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది..

మనం తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్‌ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. అలా రక్తంలో చక్కెర స్థాయి ఎంతమేర పెరుగుతుందో తెలిపే దాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్‌ అంటారు. బెండకాయలో గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు. (image source- pixabay)

ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది..

ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది..

బెండకాయలో ప్రొటీన్లు కూడా అధికంగా ఉంటాయి. షుగర్‌ పేషెంట్స్‌ ప్రొటీన్‌ రిచ్ ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్ కడుపును నిండుగా ఉంచుతుంది, ఎక్కువసేపు సంతృప్తికరంగా ఉంచుతుంది. మీరు ఆహారం ఎక్కువగా తీసుకోకుండా నిరోధిస్తుంది. బెండకాయలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది షుగర్‌ పేషెంట్స్‌ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.
వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచి, షుగర్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి బెండకాయ పెరుగు పచ్చడి ఇలా తయారు చేసుకోండి. (image source- pixabay)

Brain Boosting Foods : మీ బుర్రకు పదును పెట్టే.. ఆహారాలు ఇవే..!

బెండకాయ పెరుగు పచ్చడి..

బెండకాయ పెరుగు పచ్చడి..

ఇవి తీసుకోండి..
బెండకాయలు- ఎనిమిది, చిక్కని పెరుగు- కప్పు, ఎండుమిర్చి- 3, ఉల్లిపాయ-1, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- ఒకటి, ఆవాలు- పావుచెంచా, పసుపు- పావుచెంచా, ఇంగువ- అరచెంచా, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత
కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని బెండకాయ ముక్కల్ని తక్కువ మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వీటిని బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో ఒక చెంచా నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. దీనిలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ముద్ద, ఇంగువ, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనివ్వాలి. స్టౌ కట్టేసి కాస్త చల్లారనిచ్చి బెండకాయ ముక్కలు, కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకుంటే బెండకాయ పెరుగు పచ్చడి రెడీ.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.​Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *