PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

[ad_1]

Impact of RBI Monetary Policy on Home Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ‍‌(08 డిసెంబర్‌ 2023) తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఆర్బీఐ తన ‌రెపో రేటులో (repo rate remains unchanged) ఎలాంటి మార్పు చేయలేదు. 

ఆర్‌బీఐ నిర్ణయం పట్ల స్థిరాస్తి రంగంలో (real estate sector), ముఖ్యంగా నివాస గృహ నిర్మాణ రంగంలో ఆనందం కనిపించింది. ఇది ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తుందని, ఇళ్ల ధరలు-డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పర్ట్స్‌ నమ్ముతున్నారు. స్టాక్ మార్కెట్‌లోని స్థిరాస్తి కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల మీద కూడా ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపింది.

టాప్-7 నగరాల్లో వేగంగా పెరిగిన ఇళ్ల ధరలు (Rise in house prices in top-7 cities)
ప్రస్తుతం, మన దేశంలో హౌసింగ్ మార్కెట్ మంచి బూమ్‌లో ఉంది. గత కొన్ని నెలల్లో, దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో (ముంబై, దిల్లీ NCR, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా) ఇళ్ల ధరలు 8 శాతం నుంచి 18 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో రెపో రేటు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్నట్లయితే, బ్యాంక్‌ వడ్డీ రేట్లు (bank interest rates) కూడా పెరిగి సొంత ఇంటి కలకు దూరం కావాల్సి వస్తుందని ప్రజలు భయపడ్డారు. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో లోన్ EMI కూడా పెరగదు లేదా తగ్గదు. 

ప్రస్తుతం రెపో రేట్‌ 6.50 శాతం వద్ద ఉంది. డిసెంబర్‌ పాలసీలోనూ రెపో రేటును మార్చకపోవడంతో, వరుసగా ఐదోసారి కూడా కీలక రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. తదుపరి మీటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో (February 6-8, 2024) జరుగుతుంది. అప్పటి వరకు ఇదే రేటు అమల్లో ఉంటుంది. 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేట్‌లో RBI ఎలాంటి మార్పు చేయలేదు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభిస్తూనే ఉంది.

మిగిలిన నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ పెరుగుదల
రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ (ANAROCK) రీసెర్చ్‌ ప్రకారం, గత ఏడాది కాలంలో, హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని మరే ఇతర నగరంలోనూ ఇంత మొత్తంలో ఇంటి రేట్లు పెరగలేదు. భాగ్యనగరంలో ఇళ్ల ధరలు ‍‌(House Prices in Hyderabad) సగటున 18 శాతం పెరిగాయి. ప్రస్తుతం, దేశంలోని టాప్ 7 నగరాల్లో చదరపు అడుగు ధర సగటున రూ. 6,800కి చేరింది, 2022లో ఇది రూ. 6,105గా ఉంది. అంటే, ఏడాది కాలంలో సగటు ధర 7 శాతం వృద్ధి చెందింది. 

గృహ కొనుగోలుదార్లకు బహుమతి
అనరాక్‌ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి, RBI ద్రవ్య విధానం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ రంగానికి (Housing sector) ఆర్‌బీఐ మరోమారు ఊతమిచ్చిందని, వడ్డీ రేట్లు పెరగవు కాబట్టి హౌసింగ్ సెక్టార్‌ ముందుకు సాగడం ఖాయమని చెప్పారు. ఒక విధంగా, ఇంటి కొనుగోలుదార్లకు ఆర్‌బీఐ ఇచ్చిన బహుమతిగా అనూజ్‌ పురి అభివర్ణించారు. ఇప్పుడు, బ్యాంక్‌లు పాత రేట్ల వద్దే హౌసింగ్‌ లోన్స్‌ (Housing loan rates) ఇస్తాయి కాబట్టి, గృహ రుణం కోసం వచ్చే వాళ్లు ధైర్యంగా బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను సంప్రదిస్తారని అన్నారు. స్థిరాస్తి కంపెనీలకు కూడా పాత రేట్లకే అప్పులు దొరుకుతాయని, దీనివల్ల ఇళ్ల ధరలు పెరిగే అవకాశం కూడా తగ్గిందని అనూజ్‌ పురి వివరించారు.

మరో ఆసక్తికర కథనం: ధరలతో దబిడి దిబిడే – ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *